తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పై ఏఐసీసీ కసరత్తు..!

-

తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పాటు మరి కొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది.. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవి కాలం ఈరోజుతో ముగియనుంది. జూన్ 27, 2021న పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తన పదవీ కాలం ముగియడంతో పీసీసీ చీఫ్ పదవీ ఎవరికైనా ఇవ్వమని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు అటు ప్రభుత్వ పాలన, ఇటు పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడం బర్డెన్ అవ్వడంతో పాటు.. ఉదయ్ పూర్  డిక్లరేషన్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి రూల్ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు మరొకరికి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తోంది.  ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులకు టీపీసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ ఎన్నిక గురించి చర్చించనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. గురువారం రాత్రి 8 గంటలకు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ భేటీకి హాజరు కావాలని స్టేట్ టాప్ లీడర్స్కు ఏఐసీసీ ఇన్విటేషన్ పంపింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ దాదాపు ఢిల్లీలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వివిధ పనుల నేపథ్యంలో హస్తిన టూరు వెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి బయలు దేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version