“అయినను పోయి రావాలె హస్తినకు”.. కేటీఆర్ ట్వీట్ వైరల్

-

ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి అయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి లేక ద్వారా తెలియజేశామని తెలిపారు. అయితే కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొని..ప్రధాని, సీఎంల సమక్షంలో నీతి అయోగ్ ని ప్రశ్నించి ఉండాల్సిందని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అయితే నాగేశ్వరరావు చేసిన ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. ” అయినను పోయి రావాలె హస్తినకు అనేది పాత సామెత నాగేశ్వర్ గారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, విపక్షపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి అయోగ్ సిఫార్సు బుట్ట దాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. నీతి అయోగ్ లో నీతి కూడా అంతే”. అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version