తంబాకు టెస్ట్ కు బండి సంజయ్ రెడీ, కొకైన్ టెస్ట్ కు కేటీఆర్ రెడీయా…?: ధర్మపురి అరవింద్

-

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారే. ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ కు పిచ్చి పట్టిందా అనే చర్చ జరుగుతుందని ఎద్దేవా చేశారు. మనిషికి పిచ్చికుక్క కరిస్తే ఇలా తయారు అవుతారని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణలో 3 లక్షల 94 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అరవింద్ అన్నారు. నేను చెప్పింది తప్పు అయితే కేటీఆర్ చెప్పింది చేస్తా అని… కరెక్ట్ అయితే కేటీఆర్ ని ఎడమకాలి చెప్పుతో తొక్కుతా అంటూ సంచలన విమర్శలు చేశారు. కేటీఆర్ నిజాయితీ పరుడు అయితే…111 జీవో విరుద్ధంగా జన్వాడలో కట్టిన నిర్మాణాలను కూల్చాలని సవాల్ చేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం మాయంపై సీబీఐకి ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తంబాకు టెస్ట్ కు బండి సంజయ్ రడీ… ఆయనను నేను తీసుకొస్తా… కొకైన్ టెస్ట్ కి నివ్వు వస్తావా..? అంటూ కేటీఆర్ కు సవాల్ చేశారు. మీరు, మీచెల్లి ఎంత ఆక్టివ్ అయితే బీజేపీకి అంత లాభం అని అరవింద్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ కు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అని ఆయన ఎద్దేవా చేశారు. 7 మండలాలను ఏపీ లో కలిపితే ఇన్ని ఏళ్లుగా చింతమడక లో జిలేడు ఆకులు పీకుతున్నారా అయ్యా కొడుకులు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దమ్ముంటే మొహర్రం ర్యాలీలు వద్దని చెప్పు.. మజీద్ లకు స్పీకర్లు వద్దని చెప్పాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల పొత్తు ఉంటుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version