మీది ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుందా..? – వైఎస్ షర్మిల

-

సోమవారం ఇందిరాపార్క్ దగ్గర వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నిరసన దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. T – SAVE ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలతో దీక్షకు పిలుపునిచ్చారు షర్మిల. ఈ నేపథ్యంలో షర్మిలకు మరోసారి షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. నిరాహార దీక్ష అనుమతికై షర్మిల ముందుగానే పోలీసులకి దరఖాస్తు చేసుకున్నారు.

అయితే ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ జామ్ కారణాల వల్ల ఈ దీక్షకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తదుపరి కార్యాచరణ పై ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. దీక్షకు అనుమతి కోసం హైకోర్టు కి వెళ్లాలా..? లేదా పార్టీ కార్యాలయం దగ్గరే దీక్ష చేయాలా అనే దానిపై చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మేం నిరసన దీక్ష చేపడతామంటే కేసీఆర్ కి ఎందుకు భయం..? అని ప్రశ్నించారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా నిరుద్యోగ పోరాటం ఆగదన్నారు షర్మిల. అందరి సహకారంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. యువత కోసం తెగిస్తాం.. దీక్ష చేసి తీరుతామన్నారు. నీతి ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుందా..? అంటూ బిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తారా..? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news