పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ.. హరీశ్ రావు విమర్శలు..!

-

తెలంగాణ రాష్ట్రంలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ.. తాజాగా తెలంగాణ శాసనసభ ఉత్వర్వులను జారీ చేసింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. ఈ కమిటీలలో మొత్తం 12 మంది చొప్పున సభ్యులుగా ఉండనున్నారు.

తాజాగా కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని ఎలా నియమిస్తారని విమర్శలు గుప్పించారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ పదవీని విపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ అని.. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీకి ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది అప్రజాస్వామికమని.. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. లోక్ సభలో ఒక విధంగా శాసనసభలో మరో విధంగా వ్యవహరిస్తారా..? రాజ్యాంగం చేతిలో పెట్టుకునే రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version