హనుమకొండ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద చర్చి.. నేడే ప్రారంభం

-

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం కరుణాపురంలో అతిపెద్ద చర్చి ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళే ఈ చర్చి ప్రారంభోత్సవం జరగనుంది. 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో ఏకకాలంలో 35 వేలమందికి పైగా కూర్చునేలా సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా, ప్రపంచంలోనే మూడోదిగా నిర్వాహకులు ప్రకటించారు.

ప్రపంచంలోనే ఎక్కువ పొడవులో మొదటిది వాటికన్‌ సిటీలోని సెయింట్‌ బసిలికా చర్చి కాగా, ఎక్కువ మంది కూర్చునే సామర్థ్యం గల చర్చి దక్షిణ కొరియాలోని యోయిదా ఫుల్‌ గాప్సల్‌ చర్చిగా చెబుతున్నారు. వాటి తర్వాత స్థానం కరుణాపురంలో నిర్మించిన క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరం దక్కించుకోనుంది. బైబిల్‌ నియమాల ప్రకారం నిర్మాణం జరిగింది.

జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి, వజ్రాలు, రాళ్లు పునాదిలో వేశారు. చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని(డోమ్‌) అమెరికా నుంచి రప్పించారు. ఫ్రాన్స్‌ నుంచి సౌండ్‌ సిస్టం.. చర్చిలోపల సౌండ్‌ప్రూఫ్‌ ఏర్పాటు చేశారు. హాలెండ్‌ సాంకేతికతతో పిల్లర్లను నిర్మించారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని అద్దాల చిత్రాలతో రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version