రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఫామ్ హౌస్ లో మహిళ హత్య

-

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్ల పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో కాపలగా ఉండే మహిళ హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డి- శైలజా రెడ్డి దంపతులు దాసర్లపల్లి సమీపంలో ఫామ్ హౌస్ లో పనిచేస్తున్నారు.

శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో శైలజ రెడ్డి ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపారని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

హత్య జరిగిన సమయంలో మృతురాలి భర్త ఒక్కడే ఉండడం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇతరులు ఎవరు వచ్చి చంపారని చుట్టుపక్కల ప్రదేశాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కందుకూర్ పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం డిసిపి చింతమనేని శ్రీనివాస్ ,ఏసీపి అంజయ్య ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version