BREAKING: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దాడి!

-

Attack on Hyderabad MP Asaduddin’s house:ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ ఎంపీ అయినా అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఢిల్లీలోని అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి చేశారు దుండగులు. మొన్న అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో…. కొంతమంది బిజెపి నేతలు ఆయనను ట్రోలింగ్ చేశారు.

Attack on Hyderabad MP Asaduddin’s house

ఆ సంఘటనను మరువకముందే… ఇప్పుడు… అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపైనే దాడి చేశారు దుండగులు. దీంతో ఇప్పుడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారు అనే దాని పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. ఇక… గతంలో కూడా ఇలాగే అసదుద్దీన్ ఇంటిపైన దాడి జరిగింది. ఆ సమయంలో రాళ్లతో దాడి చేశారు. ఇక లేటెస్ట్ గా మరోసారి దాడి జరిగింది. దీంతో వెంటనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మంచి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version