హైడ్రాలిక్ జాక్ లతో బిల్డింగ్ లేపే ప్రయత్నం.. బెడిసికొట్టిన ప్లాన్‌

-

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఓ అదరుదైన సంఘటన చోటు చేసుకుంది. చింతల్ శ్రీనివాస్ నగర్ లో హైడ్రాలిక్ జాక్ ల సహయంతో ఓ బిల్డింగ్ ని పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే..వారు అనుకున్న ప్లాన్‌ బెడిసికొట్టింది. రోడ్డుకు బిల్డింగ్ డౌన్‌ ఉండటంతో పైకి లేపే ప్రయత్నం చేశారు.

ఈ తరుణంలోనే..ఆ భవనం కుంగి పోయి పక్కకు వేరే భవనం పై ఒరిగిపోయింది. ఇక ఆ బిల్డింగ్ పక్క… బిల్డింగ్ కి ఆనుకోవడంతో రెండు బిల్డింగ్ లు ఎప్పుడు కూలుతాయో అని భయబ్రాంతులకు గురౌతున్నారు స్దానిక ప్రజలు. ఈ తరుణంలోనే… ఘటన స్దలానికి చేరుకున్నారు కుత్బుల్లాపూర్‌ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇవాళ ఆ భవనం కూల్చివేస్తామని స్థానికులకు తెలిపారు టౌన్ ప్లానింగ్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version