సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

-

సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ, కౌలురైతులకు రక్షణ, రైతుసంక్షేమ పథకాల అమలుపై లేఖ రాశారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత పాదయాత్రలో అనేక మంది రైతులు నన్ను కలిసి అర్జీలు ఇచ్చారని… గత ఏడు రోజులుగా ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది రైతులు నావద్దకు వచ్చి రైతురుణమాఫీ జరుగలేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రైతురుణమాఫీ జాప్యం, రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కౌలురైతులకు ఎటువంటి రక్షణ లేకపోవడంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి రైతాంగం పొందే ఎటువంటి లబ్ది కూడా కౌలురైతులకు అందకపోవడం విచారకరమని ఫైర్అయ్యారు. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలచామని పేర్కొన్నారు.

2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతులకు వున్న కూడా బకాయిలను రద్దు చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఈ నాలుగేండ్ల కాలంలో 20,164.20 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పినా అందులో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 1,144.38 కోట్లు మాత్రమే. దీనివల్ల 5.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news