తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు మేం సిద్దమేనని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. పోడు భూములు,ధరణి సమస్యలపై సంజయ్ మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…తేదీ ఎవరు చెప్పినా సరే.. తాము ముందస్తు ఎన్నికలకు సిద్దమని ఛాలెంజ్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీదే విజయమన్నారు.
రాష్ట్రము లో ఏ సమస్య వచ్చిన కుర్చీ వేసుకుని తీరుస్తా అన్నాడని.. కానీ మహారాజ పాలన చేస్తూ బానిస పాలన చేస్తున్న మూర్కుడని కేసీఆర్ పై ఆగ్రహించారు. ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్న సీఎం ది నోరా మోరా అని నిప్పులు చెరిగారు. ధరణి తో ప్రశాంతగా ఉన్న గ్రామాల్లో చిచ్చు పెట్టాడు… హైదరాబాద్ చుట్టూ భూములు సాధించేందుకే ధరణి తెచ్చాడని మండిపడ్డారు.
స్థానిక ప్రజా ప్రతినిధులే ధరణి తో ఇబ్బందులు పడుతున్నామని వస్తున్నారు ,ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని నిలదీశారు. ధరణి వల్ల అధికారుల చేతిలో అధికారం లేకుండా పోయిందని… చేసిన తప్పులను సమర్ధించుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి…. ఓటు అనే ఆయుధం తో ప్రజలే కేసీయార్ అధికారాన్ని మార్చుతారని ఫైర్ అయ్యారు.