చట్టాన్ని అమలు చేసే విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దాడి చేసిన వ్యక్తి తమ పార్టీ వ్యక్తే అని ప్రకటించుకున్నారు. భాద్యత గల ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పని చేసిన కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాలి. ఉద్యోగుల విధి నిర్వహణలో ఆటంకాలు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దళిత పేద గిరిజనులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అమాయకులను రెచ్చగొట్టి వారు ప్రాణాలు తీసుకునేలా చేశారు. ప్రతీక్ జైన్ కు మంచి పేరు ఉంది. పేద ప్రజల కోసం పనిచేసే అధికారి. ఐటిడిఎ గిరిజనుల కోసం నిరంతరం శ్రమించారు.
కానీ సురేష్ అనే వ్యక్తి నాటకీయంగా కలెక్టర్ దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడినట్లు చేశారు. కాల్ డేటా మొత్తం బయటకు తిస్తున్నాము. దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్న శిక్షిస్తాము. అభివృద్ధి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతటా అభివృద్ధి జరగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సురేశ్ అనే వ్యక్తి ఎవరెవరితో మాట్లాడారో అన్ని వివరాలు బయట పెడుతున్నాం.. గతంలో నెలల తరబడి ఉద్యమాలు చేసినా ఎప్పుడైనా కలెక్టర్ల మీద దాడులు జరిగాయా అని భట్టి ప్రశ్నించాడు.