ఆటో నడిపిన బండి సంజయ్..వీడియో వైరల్

-

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆటో నడిపారు. వేములవాడలో ప్రజాహిత యాత్ర సందర్భంగా ఆటో నడిపి వారి సమస్యలు తెలుసుకున్నట్టు ఎంపీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ఆటో డ్రైవర్లకు వివరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేయనున్నారు.

BJP Bandi Sanjay Padayatra In Vemulawada Town

ఈ సందర్భంగా బండి సజంయ్ మాట్లాడారు. కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని పెట్టలేదు, కేవలం బీఆర్‌ఎస్‌ కు అనుకూలంగా ఉండడానికే కాంగ్రెస్ చేస్తుందని…మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీజెపీ,బీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేశారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ పార్టీని బదనాం చేయడానికే కుట్ర చేస్తున్నారు… బీబీపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని సర్వేలు వచ్చాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version