బీజేపీపై కేసీఆర్ ఫైర్… రాజకీయం కోసం మతోన్మాదాన్ని పెంచుతోందని ఆగ్రహం

-

భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వ, అధికార బీజేపీ పార్టీ దుర్మార్గమైన పద్దతితో మతోన్మాదాన్ని పెట్రేగేలా చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అనేక రకాలుగా దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని… దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, జీడీపీని నాశనం చేశారని, ఆర్థిక వ్యవస్థ చెల్లాచెదురైందని, పరిశ్రమలు మూత పడుతున్నాయని, హంగర్ ఇండెక్స్ లో క్షీణించిపోయామని, సామాన్యుల నడ్డి విరుస్తున్నారని బీజేపీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అధికార అహంకారం తలకెక్కిందని విమర్శించారు. కాశ్మీర్ ఫైల్స్, పుల్వామా అంటూ ప్రజల్ని ఉద్వేగ పరచడంతో ఓట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. శ్రీరామ నవమి రోజున ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో తెలుసని.. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ రాళ్లేసి ఉద్రిక్తతలు పెంచుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటకల్లో ఇలా రాల్లేసి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అద్బుతమైన నగరం బెంగళూర్ నగరం అని అనేక ప్రభుత్వాల ప్రయత్నం వల్ల సిలికాన్ సిటీ అయిందని… 30 లక్షల మందికి నేరుగా ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయని.. మరో 30 లక్షల మందికి పరోక్షంగా లభిస్తున్నాయని అలాంటి నగరంలో హిజాబ్, హలాల్, ముస్లిం దుకాణాల్లో కొనవద్దంటూ ఉద్రిక్తతలను పెంచుతున్నారని విమర్శించారు. దేశం చిన్నాభిన్నం అయితే వందేళ్లు వెనకబడిపోతాం అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news