ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ విడుదల చేసిన బిజెపి నేతలు

-

ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు బిజెపి నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంగ్రామ యాత్ర ఇన్చార్జి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చిత్తరమ్మ దేవాలయం నుండి బండి సంజయ్ నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారని తెలిపారు. పది రోజులపాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. ముగ్గురు పోలీస్ కమిషనర్లకు నాలుగో విడత యాత్ర రూట్ మ్యాప్ ఇచ్చి.. అనుమతులు కోరామన్నారు. కానీ ఇంతవరకు రాతపూర్వకంగా అనుమతులు ఇవ్వలేదన్నారు. దీంతో గతంలో మాదిరిగానే అనుమతులు ఇచ్చారని భావిస్తున్నామన్నారు మనోహర్ రెడ్డి. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకున్నా యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే కోర్టుకి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామన్నారు. యాత్రను ఎవరు అడ్డుకోలేరని.. తోక ముడుచుకుని ఇంట్లోనే కూర్చోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version