ఏ క్షణమైనా బీజేపీ తొలి జాబితా విడుదల కావచ్చు : ఎంపీ లక్ష్మణ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల ప్రకటన రావచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. 3 రాస్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్టు వివరించారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని తెలిపారు.

సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్ద పీట వేశామని తెలిపారు. మొదటి విడుతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఓసీ అభ్యర్థులకు 14 సీట్లు కేటాయించినట్టు సమాచారం. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు. కానీ మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలుస్తోంది. అతను పోటీ చేసే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోందని ఎంపీ లక్ష్మన్ తెలిపారు. మరోవైపు తొలి జాబితాలోనే రాజాసింగ్ పేరు వస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version