తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నప్పటికీ పరీక్షలు యధా విధంగా నిర్వహిస్తామని…సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామని…. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్లు వివరించారు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్.