కాంగ్రెస్ న్యాయ పత్రంలో బ్రిటీష్ ఆనవాళ్లున్నాయి : ఎంపీ లక్ష్మణ్

-

కాంగ్రెస్ న్యాయపత్రాన్ని పూర్తి అన్యాయ పత్రంగా ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి వికసిత భారత్ కోసం బీజేపీ కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ విభజిత భారత్ కోసం పాల్పడుతోందని, 12 లక్షల కోట్లు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. న్యాయపత్రం బ్రిటిష్ ఆనవాళ్లు కొనసాగిస్తూ విభజించు-పాలించులా ఉందని విమర్శించారు. ముస్లిం లీగ్ మాదిరిగానే కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఉందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పత్రానికి భిన్నంగా బీజేపీ సంకల్ప పత్రం ఉంది. మైనార్టీజం పేరుతో కాంగ్రెస్ మెజార్టీ ప్రజల మనోగతం గాయపరుస్తుంది. కేవలం ఓట్ల కోసం తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటిలతో మోసం చేస్తోంది. ఉచితాలు-గ్యారంటిలతో కాంగ్రెస్ మోసం చేస్తోంది. సంకల్పపత్రాన్ని పవిత్ర పత్రంగా బీజేపీ భావిస్తోంది” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version