సిరిసిల్లలో తయారవుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ జెండాలు

-

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అటు భారత రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటికే 115 అభ్యర్థులను ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

BRS, Congress, YSRCP flags being made in Sirisilla

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు అనగానే గుర్తొచ్చే వాటిలో పార్టీల జెండాలు ఒకటి. దీంతో నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు అటు వైసిపి కూడా వాటిని సిద్ధం చేయిస్తున్నాయి. పార్టీల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో కార్మికులు జెండాల తయారీలో నిమగ్నములయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వచ్చే ఏడాది ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో వైసిపి జెండాలు కూడా సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version