సీఎం రేవంత్ రెడ్డిని కలసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే !

-

తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.గులాబీ పార్టీ నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పదిమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే.మరి కొంతమంది కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.ఇలాంటి నేపథ్యంలో…కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మరో షాక్ తగిలింది.

BRS LBnagar MLA Sudhir Reddy met CM Revanth Reddy.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గులాబీ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలవడం జరిగింది.మొన్నటివరకు జ్వరం బారిన పడిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యారు.ఆక్టివ్ కాగానే వెంటనే సీఎంలు రేవంత్ రెడ్డిని కలిశారు సుధీర్ రెడ్డి. దాదాపు గంటకు పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సుధీర్ రెడ్డి సమావేశం అయ్యారట. తన ఇంట్లో శుభకార్యానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక ఇచ్చారట సుధీర్ రెడ్డి. కానీ ఆయన గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరేందుకే రేవంత్ రెడ్డిని కలిసినట్లు చర్చ జరుగుతోంది.దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version