ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా BRS పార్టీ ఆందోళనలు.

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… ఆందోళనలకు టిఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చింది. రైతు భరోసా అమలుపై…. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రకటనకు నిరసనగా.. ఇవాళ ఆందోళనను చేపట్టనుంది. వెంటనే రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్… ధర్నాకు దిగనుంది.

ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు… ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని తుమ్మల చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం చేశారు.

వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిం దేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని మండిపడ్డారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసింది. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version