తెలంగాణ ప్రభుత్వం తాజాగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. పూజలు నిర్వహించిన అనంతర సీఎం రేవంత్ రెడ్డి ఈ నూతన ”తెలంగాణ తల్లి” విగ్రహ ఆవిష్కరణ చేసారు. కానీ అదే సమయంలో BRS ఆధ్వర్యంలో మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే విగ్రహం కాదు.. మాదే నిజమైన తెలంగాణ విగ్రహ రూపు అంటూ పేర్కొన్నారు BRS నేతలు. ప్రభుత్వానికి పోటీ గా మేడ్చల్ పార్టీ కార్యాలయంలో విగ్రహావిష్కరణ చేసారు.