రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ..!

-

తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో పదేళ్ల విధ్వంసం జరిగింది. తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుకున్నారు. గాంధీ భవన్ కు కాదు.. ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా అని రాహుల్ గాంధీకి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు. ఏడాదిలోనే అన్ని వర్గాలను రోడ్డెక్కించిన ఘనత మీ ప్రభుత్వానిదే. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే.

మీ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంతా ఉన్నాయి. పులకేసి మాదిరిగా మీ ముఖ్యమంత్రి ప్రజలను హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు.. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైడ్రా, మూసీ బాధితులకు వద్దకు వెళ్లాలి. మీ చేతగాని పాలనతో రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రికి ఎందుకు అండగా ఉన్నారు. మీ అనుమతితోనే అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. అభివృద్ది పథంలో ఉన్న తెలంగాణను అవీనీతి తెలంగాణగా మార్చారు. తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version