హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది కారు. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులోనే ఈ కారు ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరిపారు.
ఇక కారు నడిపిన వ్యక్తి మీడియాతో కూడా మాట్లాడాడు. ఉదయం 6 గంటలకు ట్యాంక్ బండ్ పై నుండి వెళ్తున్నాను.. ఎన్‌టీఆర్ ఘాట్ దగ్గర టర్నింగ్ దగ్గరికి వచ్చే సమయంలో నాకు నిద్ర వచ్చింది, కళ్ళు మూసుకుని పోయాయని తెలిపాడు. వెంటనే కారు అదుపుతప్పి ఎలక్ట్రిక్ ఫోల్‌ను ఢీ కొట్టి, చెట్టును ఢీ కొట్టింది. కారులో నేనొక్కడినే ఉన్నానని పేర్కొన్నాడు.
డివైడర్ ను ఢీ కొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు..
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం
రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసం
మద్యం మత్తులోనే ఈ కారు ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసుల విచారణ pic.twitter.com/ZcqcTnUsAO
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025