తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది…NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించిందని పేర్కొంది కేంద్రం.
అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల నిర్మాణం), మైనర్ ఇరిగేషన్-ట్యాంకుల పూడిక తీరకు సంబంధించిన పనుల అంచనా, ఆమోదం, అమలులో ప్
అవకతవకలు వంటి అంశాలను కేంద్ర బృందం తనిఖీలో బయట పడిందని తెలిపింది.నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, అస్థిరమైన కందకాల పనులకు సంబంధించిన ఇలాంటి అవకతవకలు జరిగాయని..సాంకేతిక పరమైన ఆమోదం పొందకుండా పనులను చేపట్టారని తెలిపింది. కమ్యూనిటీ సమాచార బోర్డులు, జాబ్ కార్డ్‌లు, గ్రామ పంచాయతీలలో సరైన డాక్యుమెంటేషన్ నిర్వహణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు..ఈ అవకతవకలపై మరింత విచారణ జరపడానికి 15 సెంట్రల్ టీమ్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించాయని వెల్లడించింది.