నేను మునుగోడు బరిలో ఉంటా – చలామల కృష్ణారెడ్డి

-

నేను మునుగోడు బరిలో ఉంటానని ప్రకటించారు చలామల కృష్ణారెడ్డి. కాంగ్రెస్ రెండవ జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు. బోథ్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే బాపురావు స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్, ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రామ్ రెడ్డి, మహేశ్వరం టికెట్ రాకపోవడంతో నరసింహారెడ్డి, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, మునుగోడులో చలమల కృష్ణారెడ్డి ఇవాళ అనుచరులతో భేటీ అయి…. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

Chalamala Krishna Reddy on munugodu election

ఇండిపెండెంట్ ఆ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు చలమల కృష్ణారెడ్డి. ఈ తరుణంలోనే.. కీలక వ్యాఖ్యలు చేశారు చలమల కృష్ణారెడ్డి. కిందపడిపోయిన కాంగ్రెస్ జెండాని 15 నెలలుగా నిలబెట్టిన నన్ను మోసం చేసారని ఫైర్‌ అయ్యారు. మోసం చేసిన అందరికి తగ్గిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు చలమల కృష్ణారెడ్డి. రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతో కాంగ్రెస్ పని అయిపోయింది అని బీజేపీ జెండా పట్టాడు, ఇప్పుడు బీజేపీ పని అయిపోయింది అని కాంగ్రెస్ జెండా పట్టాడు. నేను మునుగోడు బరిలో ఉంటానని ప్రకటించారు చలమల కృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version