హైదరాబాద్‌ లో 3667 కోట్ల పనులు..కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ 6 ఫ్లై ఓవర్లు !

-

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త. ప్రజా పాలన విజయోత్సవంలో గ్రేటర్ పరిధిలో హై సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. జిహెచ్ఎంసి పరిధిలో 3500 కోట్లతో ఫ్లై ఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Chief Minister Revanth Reddy will launch high city works in the greater area in celebration of the victory of public governance

పలు జంక్షన్ లో కోటి 50 లక్షల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం కూడా ఉంది. 16 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న రైన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ లో పూర్తయిన వాటి ప్రారంభోత్సవంలో రేవంత్‌ పాల్గొంటారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబోయే ఆరు ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు శంకుస్థాపన చేస్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హై సిటి ప్రాజెక్టు పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అన్నింటినీ కలిపి ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్లో వర్చువల్ గా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version