అంబేద్కర్, గాంధీల పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టారు. శాసనమండలి ఛాంబర్లో అంబేద్కర్, గాంధీల పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి భక్తి ముదిరిపోతుందని చర్చ జరుగుతోంది. సాక్షాత్తు లెజిస్లేటివ్ కౌన్సిల్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో జాతిపిత మహాత్మా గాంధీ,
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రముఖ సామాజిక వేత్త, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫోటోను చేర్చారు. గురువారం శాసనమండలికి నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అక్కడ ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోయారు. మహాత్ముల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఏంటని అక్కడ చర్చ నడిచింది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.