సంగారెడ్డి, పటాన్చెరులలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు

-

తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారని ప్రకటించారు మంత్రి హారీష్ రావు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ… పటాన్ చేరు మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దుతామన్నారు.

త్వరలో పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ నీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు. సంగారెడ్డి, పటాన్చెరు లో భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ పట్ల దశ దిశ లేకుండా పని చేస్తుందని చెప్పారు.

బియ్యం ఎగుమతుల పైన ఎందుకు నిషేధం విందించారని ఆగ్రహించారు. రైతులను కొడుతూ..కార్పొరేటర్లకు పంచుతున్నారని.. కేంద్రం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. నిషేధం తొలగించాలని డిమాండ్‌ చేశారు హరీష్‌ రావు. దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని.. దేశానికి ధాన్యాగారం తెలంగాణ అన్నారు. తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారని.. కేంద్ర ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ లో పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news