CM KCR : నేడు మధిర, వైరాలో సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభలు

-

CM KCR : నేడు మధిర, వైరాలో బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభలు జరుగనున్నాయి. ప్రతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడానికి కారణం సీఎం కేసీఆర్‌. ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. సీఎం కేసీఆర్ బహిరంగ సభ బీఆర్ఎస్ నేతలకు బ్రహ్మాస్త్రం లాంటిది. దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు నేతలు.

CM KCR

అయితే… సీఎం కేసీఆర్‌ పర్యటన షెడ్యూల్ ముందస్తుగానే ఖరారు కావడంతో ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకు ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు, కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు, జనసమీకరణలో నిమగ్నమవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే..నేడు మధిర, వైరాలో బీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీర్వాద సభలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version