నేడు వైరాలో సీఎం రేవంత్‌ బహిరంగ సభ

-

నేడు వైరాలో సీఎం రేవంత్‌ బహిరంగ సభ ఉండనుంది. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా పూసు గూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

CM Revanth’s public meeting in Vaira today

అనంతరం వైరాలో బహిరంగ సభలో పాల్గొననున్నారు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల , ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసులు. అనంతరం రెండు లక్షల రుణమాఫీ పథకంను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బిజీ కొత్తూరు వద్ద మొదటి పంపు హౌస్ ను ప్రారంభించనున్నారు జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమలాపురం వద్ద మూడవ పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version