Suryapet District: సూర్యాపేట జిల్లాలో కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ వద్ద కూలింది ఓ బ్రిడ్జి. కందిబండ చెరువుకు గండి పడటంతో కోదాడ, మేళ్లచెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో నాగార్జున సాగర్ కాలువకు గండి పడింది.
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడటం తో నడిగూడెం మండలం లోని కాగితపు రామచంద్రాపురం, కరివిరాల గ్రామాలతో పాటు.. 4 తండాలు పూర్తిగా నీట మునిగడం జరిగింది.
కుసుమంచి మండలం లోని మరో 4 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండి పడటంతో అధికారులు అలర్ట్ అయి.. ప్రజలను సేఫ్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి ఆహారం, సదుపాయాలు అందిస్తున్నారు.