తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కంపెనీలు!

-

మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచంలోని అగ్రగామిగా ఉన్న కార్నింగ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లాను తయారు చేయడానికి ఒక తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయడానికి తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పంచుకోవడానికి సంతోషంగా ఉందని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ గతంలో ట్వీట్ చేశారు. ముఖ్యంగా పెట్టుబడి పరిమాణం రూ.934 కోట్లతో 800 మందికి ఉపాధి లభిస్తుందని.. అయితే స్మార్ట్‌ఫోన్‌లు,  ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో మరింత ముఖ్యమైన వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు.  జాన్ బేన్ సీనియర్ వీపీ, రవికుమార్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ మరియు ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్‌మెల్‌తో  సమావేశం జరిగింది. 

అయితే తాజాగా ప్రభుత్వం మారడంతో తెలంగాణ నుండి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి కంపెనీలు. యాపిల్ ఫోన్లకు గొరిల్లా గ్లాస్ తయారు చేసే కోర్నింగ్ సంస్థ తెలంగాణలో సుమారు రూ.1000 కోట్లతో 800 మందికి ఉపాధి కల్పించేలా పెట్టాలి అనుకుని సెప్టెంబర్ 1న తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఆ కంపెనీ తెలంగాణను కాదని చెన్నైకి తరలిపోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version