డిపాజిట్లు రాని కాంగ్రెస్ BRS కి ప్రత్యామ్నాయమా..? – బండి సంజయ్

-

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణలో బిజెపి పని అయిపోయినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక మొదలుకొని.. జిహెచ్ఎంసి, హుజురాబాద్, మునుగోడు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బిజెపి వైపే నిలిచారన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందని, డిపాజిట్లు రాని కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుందన్నారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాలేదని అన్నారు. సారు, కారు, 60% సర్కారును ఇంటికి సాగనంపేదాక పోరాడతానని స్పష్టం చేశారు. అల్లు రామలింగయ్య లాగా కాంగ్రెస్ పార్టీ సైడ్ విలన్ పాత్ర పోషిస్తే, కైకాల సత్యనారాయణ పాత్రను ఎంఐఎం, సూది దబ్బడం పార్టీలు పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version