తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న రాాహుల్ గాంధీ ఓయూ టూర్ కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓయూలో ఈనెల 7న రాహుల్ గాంధీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అయితే ఈ పర్యటనకు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనుమతి ఇవ్వలేదు. తాజాగా హైకోర్ట్ ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వీసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు కాంగ్రెస్ నేతలు హైకోర్ట్ లో మరోసారి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్ట్ ఆదేశాలను వీసీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ కోర్టు కు వెల్లడించింది. తాజాగా ఈరోజు వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. రాహుల్ గాంధీ ఓయూలో విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే వస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ తరుపున న్యాయవాదులు బలంగా వాదించారు. తాజాగా రాహుల్ గాంధీ పర్యటనకు హైకోర్ట్ అనుమతి ఇవ్వాలని ఓయూ వీసీని ఆదేశించింది. అయితే ఈ పర్యటనకు కొన్ని షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.
Breaking news: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
-