రాజేంద్రనగర్ లో కంటైనర్ లారీ బీభత్సం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ రవి ఫుడ్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. రవి ఫుడ్ యూనిట్ 2 లో పార్క్ చేశాడు కంటైనర్ డ్రైవర్. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వెనక్కి వచ్చిన కంటైనర్.. మెయిన్ గేటు తాకుకుంటూ బయటకు దూసుకు వచ్చింది. లారీని ఆపడానికి స్థానికులు సకల ప్రయత్నాలు చేశారు. రోడ్డుపై వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది కంటైనర్. దీంతో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి.

భారీ కంటైనర్ స్పీడ్ గా వెనక్కు దూసుకు రావడంతో మోటార్ సైకిల్ వాహనాలు వదిలిి పారిపోయారు. రోడ్డుపై ఉన్న ఐదుగురికి గాయాలు అయ్యాయి. దీంతో కంటైనర్ లారీని రోడ్డుపై వదిలేసి పారిపోయాడు డ్రైవర్. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న మైలార్ దేవి పల్లిపోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.