మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కే సిపిఐ మద్దతు – నారాయణ

-

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు అని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీఆర్ఎస్ కి మాకు మధ్య రాజకీయంగా పెద్ద సంబంధాలు లేవు కానీ.. బిజెపి రాజకీయ ఆధిపత్యం కోసం మునుగోడు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు.టీఆర్ఎస్ మాత్రమే బిజెపిని ఎదుర్కొంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ బిజెపి నీ ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు నారాయణ.

అందుకే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తుందన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బిజెపి కూల్చేసిందని.. ఢిల్లీలో ఆప్ మంత్రిపై సీబీఐ దాడులు దారుణమన్నారు. దేశంలో ఎన్డీఏ కు వ్యతిరేకత మొదలైందన్నారు నారాయణ. దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సీపీఐ ఉందన్నారు. ఇందులో భాగంగనే టీఆర్ఎస్ కి సీపీఐ మద్దతు తెలిపిందన్నారు.

ఏపీలో మాత్రం బిజెపికి అన్ని రాజీయపార్టీలు మద్దతు ఇస్తున్నాయన్నారు.చంద్రాబునాయుడు మోడీ షేక్ హ్యాండ్ కే మురిసిపోతున్నాడని ఎద్దేవా చేశారు.జగన్ తన సుఖం కోసం ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు నారాయణ. పవన్ కళ్యాణ్ బిజెపి గూటిలోనే ఉన్నారని.. విశాల ప్రయోజనాల కోసం బిజెపిని ఏపి లోని పార్టీలు వీడి రావాలన్నారు. బిజెపితో వైసిపి అంటకాగితే వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎవరైతే ఏపీలో బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతారో ఆ పార్టీ కి మద్దతు ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version