TSPSC పేపర్ లీక్ వ్యవహారం.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

-

TSPSC క్వశ్చన్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో విద్యుత్ శాఖ డీఈ రమేశ్​ను విచారిస్తున్న సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఏఈ ప్రశ్నపత్రం విక్రయించడం ద్వారా రమేశ్‌ కోటి 10 లక్షలు సంపాదిచినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 30 మందికి అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్లు విక్రయించినట్లు సిట్‌ గుర్తించింది. గతంలో వరంగల్ విద్యుత్‌ శాఖలో DEగా పనిచేసిన రమేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కి సురేశ్‌ మిత్రుడు కాగా…రమేశ్‌కి సురేశ్‌ బంధువు. ఆ మొత్తం వ్యవహారంలో ప్రవీణ్‌కుమార్‌, DE రమేశ్‌ మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.

అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా పత్రాలు ప్రవీణ్‌ నుంచి సురేశ్‌కి అందాయి. ఆ విషయాన్ని రమేశ్‌కి సురేశ్ చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అభ్యర్ధులకు…. వివిధ అంశాలపై రమేశ్‌ శిక్షణనిస్తుంటాడు. ఆ సమయంలో అక్కడి అభ్యర్ధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ప్రశ్నాపత్రాలు విక్రయిస్తే వచ్చిన వాటిలో రమేశ్‌కి 40శాతం ఇస్తానని సురేశ్‌ చెప్పగా…. అందుకు ఒప్పుకోలేదు. చివరకు రమేశ్‌కి 70 శాతం, సురేశ్‌కి 30 శాతంగా ఒప్పందం కుదిరింది. అలా తనకున్న పరిచయాలతో 30 మందికి పేపర్లు విక్రయించి రమేశ్‌ కోటి 10 లక్షలు సంపాదించినట్లు సిట్ గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version