డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదివారం ఖమ్మంలో జిల్లాలో పర్యటిస్తారు. హైద్రాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మంకు చేరుకునే డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలుకుతారు. ఉదయం 11గంటలకు ఆర్‌సిఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధినగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఆతరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి మధ్యాహ్నం 1.15గంటలకు చేరుకుంటారు. రూ. 30 కోట్లతో బోనకల్లు-అల్లపాడు- వంగవీడు బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధిర క్యాంపు కార్యాలయానికి మధ్యాహ్నాం 2గంటలకు చేరుకుంటారు. భోజన విరామం ఆనంతరం మధ్యాహ్నం 3గంటలకు మధిర మండలం చిలుకూరు గ్రామాంలోని శివాలయం వద్ద రూ.70లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ. 285లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తరువాత మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకుంటారు. రూ. 275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను-సిద్దినేని గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్తాపన చేస్తారు. ఆతరువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500లక్షలతో మాటూరు నుంచి ముస్లీం కాలనీ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొంటారు. ఆతరువాత రాత్రికి మధిర క్యాంపు కార్యాలయానికి చేరుకొని అక్కడే బస చేస్తారు. సోమవారం ఉదయం 7గంటలకు మధిర క్యాంపు కార్యాలయం నుంచి హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.