సూర్యపేటలో అవమానీయ ఘటన.. తల్లి మృతదేహం ఎదుటే ఆస్తి కోసం తగాదాలు..!

-

మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసిపోతున్నాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు మధ్య ప్రేమానురాగాలు అనురాగాలు మాయం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కందులవారిగూడెం గ్రామానికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి చిన్న కుమారుడు కూడా చనిపోయారు. నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత ఐదేళ్లుగా లక్ష్మమ్మ ఉంటుంది. దీంతో ఇటీవల కాలంలో చిన్న కుమార్తె ఇంట్లో కాలు జారి కింది పడిపోయింది. దీంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు.

దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆక్సిజన్పైనే బతుకుతుందంటూ వైద్యులు బుధవారం తేల్చి చెప్పారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్తోనే చిన్న కుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ పార్క్ చేయించగా లక్ష్మమ్మ అదులోనే తుది శ్వాస విడిచింది. ఈ లోపు లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని.. పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో.. మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు లెక్కలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుబట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా.. కొడుకు, కూతుళ్ల పంచాయితీ మాత్రం ఆగలేదు.

లక్ష్మమ్మ గతంలో తన సొంత డబ్బు రూ.21 లక్షల వరకు పలువురికి అప్పుగా ఇచ్చింది. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి ఆ రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగతా రూ. 15 లక్షలు కొడుకు దక్కించుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలోనే కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించుకు కూర్చున్నాడు. అయితే, శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రూ.2 లక్షలు ఇవ్వడంతో పంచాయతీ కొలిక్కి వచ్చింది. అనంతరం లక్ష్మమ్మ అంత్యక్రియలను పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version