కేంద్ర ప్రభుత్వం ఈజీ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ రిపోర్టును వినాయక చవితి పండుగ రోజున రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ లిస్టులో ఎప్పుడు తెలంగాణ టాప్ టెన్ లో ఉండేది. కానీ ఈసారి మాత్రం అత్యంత దారుణంగా పడిపోయింది. టాప్ టెన్ లో కూడా… తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కలేదు.
పక్కన ఉన్న.. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు కూడా… ఈజీ ఆఫ్ డూయింగ్ లో.. స్థానం దక్కింది. కానీ తెలంగాణకు మాత్రం.. ఆ ఛాన్స్ రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం… పెట్టుబడిదారులకు సరైన వసతులు కల్పించలేదని.. అందుకే ఇలాంటి పరిస్థితి ఉందని గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీసారి.. తెలంగాణ టాప్ లో ఉండేదని కేటీఆర్ కూడా సెటైర్లు పేల్చారు.