తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి చార్జీలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీలు పెంచేలా ఆ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్ పై నేటి నుంచి ఐదు రోజుల పాటు విద్యుత్ నియంత్రణ మండలి విచారణను చేపట్టనుంది.
2024-25లో రూ. 12 వేల కోట్ల మేర చార్జీలు పెంచేందుకు అనుమతిని ఇవ్వాలని TGSPDCL/TGNPDCL కోరుతున్నాయి. HT కేటగిరి విద్యుత్ చార్జీల పెంపు, LT కేటగిరిలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ చార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో నవంబర్ 1వ తేదీ నుంచి చార్జీలు పెరిగే అవకాశం ఉంది. అయితే… నవంబర్ 1వ తేదీ నుంచి చార్జీలు పెరిగే అవకాశం ఉన్న తరునంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.