కేసీఆర్ సభల దగ్గర విద్యుత్ శాఖ గస్తీ !

-

కేసీఆర్ సభల దగ్గర విద్యుత్ శాఖ అధికారులు గస్తీ చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి పాలనలో కరెంట్‌ కోతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే..రేవంత్ రెడ్డి సర్కార్ కరెంట్ కాపలా కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార సభల దగ్గర కరెంట్ అధికారులు గస్తీ కాస్తున్నారు.

Electricity Department patrols near KCR Sabhas

ఇటీవల సభలు జరుగుతున్న సమయంలో పవర్ కట్ జరుగుతున్నందున ముందస్తు భద్రతగా ఉంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు లేవంటున్నది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. కానీ బీఆర్‌ఎస్‌ సభల దగ్గరే పవర్ కట్స్ అవుతుండడంతో ప్రభుత్వానికి అవమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సభల దగ్గర ఏమైనా పవర్ కట్స్ అయితే చర్యలు తీసుకోవాలని ముందస్తుగా విద్యుత్ శాఖ గస్తీ కాస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version