నీళ్లకు కరువు.. బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేల్చాలని యత్నించిన రైతులు..!

-

తెలంగాణలో ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవలేదు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రైతులకు తీవ్ర పంట నష్టం చేయడం గమనార్హం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతులు వర్షాలు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కుంటున్నారు. ప్రధానంగా  నాగార్జున సాగర్ కి ఎగువ ప్రాంతంలో ఉన్న నల్గొండ జిల్లాకు రైతులు వర్షాలు సరిగ్గా లేక.. పంట పండక అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు.

మరోవైపు పెద్దపల్లి జిల్లాలో నీటి ఓ సంఘటన చోటు చేసుకుంది. నీళ్లకు కరువు.. బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేల్చాలని యత్నించారు రైతులు. పెద్దపల్లి జిల్లా భోజన్నపేట గ్రామంలో హుస్సేన్ మియా వాగు మీద నిర్మించిన చెక్ డ్యామ్  ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చేందుకు కొందరు రైతులు యత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతుల కారణంగా నీటిని తోడేయడం.. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలకు నీరు లేక చెక్ డ్యామ్ దిగువ ప్రాంతం లోని రైతులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version