రైలు ఢీ కొని తండ్రి, ఇద్దరూ కుమార్తెలు మృతి

-

మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో దారుణ ఘటన జరిగింది.  ఆదివారం గౌడవెల్లి రైల్వే స్టేషన్లో తండ్రి, ఇద్దరు కూతుళ్లు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ కి చెందిన కృష్ణగా పోలీసులు గుర్తించారు.

కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ మెన్ గా విధులు నిర్వహిస్తుంటారు.  అయితే ఆదివారం సెలవు దినం కావడంతో తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పనికి వచ్చాడు కృష్ణ. తాను పనిచేస్తుండగా తన కూతుళ్లు రైల్వే పట్టాలపై ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో రైలు వేగంగా దూసుకొచ్చింది. ఇద్దరు కూతుళ్లను కాపాడబోయి ముగ్గురు రైలు కింద పడిపోయారు. మృతి చెందిన కూతురు పేరు వరిత, వరిణిగా స్థానికులు పేర్కొంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version