పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. ఆల్ఫా హోటల్‌కు ఫైన్

-

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో బడా బడా హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం అపరిశుభ్రత, పాడైపోయిన పదార్థాలు కస్టమర్లకు వడ్డించడం, ఇతర భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటివి గుర్తిస్తున్నారు. ఇప్పటికే పేరు పొందిన చాలా రెస్టారెంట్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.

తాజాగా సికింద్రాబాద్‌లో ది ఫేమస్ అల్ఫా హోటల్‌పై రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలను నేడు వెల్లడించారు. హోటల్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు తెలిపారు. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు వెల్లడించారు. నాసిరకం వస్తువుల ఉపయోగంతో పాటు కిచెన్‌ దుర్గంధంగా ఉందని.. న్నట్లు చెప్పారు. డేట్‌, బ్యాచ్‌ నంబర్‌ లేకుండా  బ్రెడ్‌, ఐసీక్రీమ్‌ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హోటల్‌కు టాస్క్‌ఫోర్స్‌ నోటీసులు జారీ చేసి రూ.లక్ష జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version