రైతు కొడుకు పెళ్లి కోసం కేసీఆర్ రూ. 5 లక్షల ఆర్ధిక సాయం

-

KCR: రైతు కొడుకు పెళ్లి కోసం కేసీఆర్ రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు.

For farmer’s son’s wedding, KCR spent Rs. 5 lakh financial assistance

దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version