BJP లో చేరిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం

-

నేడు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు రత్నం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. పదవులు కాదని.. ఇతర పార్టీలకు పదవులు ముఖ్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Former Chevella MLA KS Ratnam joined BJP

బీజేపీ తెలంగాణ ప్రజల టీమ్ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పనిచేయాలని కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనను ప్రజలు చూశారని.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బీఆర్ఎస్ పాలననూ చూశారని.. అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version