ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 45 మందితో రెండో జాబితాను ఆపార్టీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. 55 మందితో ఇటీవల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ రెండవ జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు. బోథ్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే బాపురావు స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్, ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రామ్ రెడ్డి, మహేశ్వరం టికెట్ రాకపోవడంతో నరసింహారెడ్డి, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, మునుగోడులో చలమల కృష్ణారెడ్డి ఇవాళ అనుచరులతో భేటీ అయి…. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇండిపెండెంట్ ఆ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు చలమల కృష్ణారెడ్డి.