డీకే అరుణ హైకోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారని..హైకోర్టును తప్పుదోవపట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. నాకు నోటీసులే అందలేదని.. అందుకే ఎక్స్-పార్టీ జడ్జిమెంట్ వచ్చిందని వెల్లడించారు.
హైకోర్టు తీర్పులోనే ఈ విషయాన్ని ప్రస్తావించారని.. నాకు నోటీసులు అందినట్టు నా సంతకాలు ఫోర్జరీ చేశారని ఆగ్రహించారు. ఎమ్మెల్యేగా ఉన్న నాకు నోటీసులు ఎక్కడైనా ఇవ్వొచ్చు.. నేను 28వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను. ప్రజల్లో గెలవలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారు…సుప్రీంకోర్టులో స్టే లభించింది. న్యాయం నావైపే ఉందని వెల్లడించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరుగుతుందన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.